తెలంగాణ

telangana

ETV Bharat / state

గుట్కా ప్యాకెట్ల పట్టివేత... ముగ్గురి అరెస్ట్ - latest crime news in mahabubabad district

మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా గుట్కా, అంబర్​ ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

A gang that illegally moves the Gutka
అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

By

Published : Dec 22, 2019, 11:15 AM IST

మహబూబాబాద్​లోని లక్ష్మీ థియేటర్​ సమీపంలో అక్రమంగా గుట్కా, అంబర్​ ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.1 లక్ష 50 వేల విలువ గల గుట్కా, అంబర్​ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

పట్టణంలో సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఎస్సై మురళీధర్​ వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా అందులో గుట్కా, అంబర్​ ప్యాకెట్లు లభించాయి. నిందితులు వాంకుడోత్​ చిట్టిబాబు, శ్రీరంగం వెంకన్న, గుంటూరు సోమన్నలపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

ఇదీ చూడండి: సరకు రవాణాకు.. సిద్ధం కాబోతున్న ఆర్టీసీ బస్సులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details