తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగ నోట్లను చలామణి చేస్తున్న కుటుంబం అరెస్టు - fake currency

యూట్యూబ్​లో చూసి దొంగనోట్లను ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడు. తయారుచేసి చిన్న చిన్న దుకాణాల్లో, బెల్టు షాపుల్లో అతని కుటుంబంతో కలిసి  దొంగనోట్లను చలామణి చేశాడు. చివరకు కుటుంబంతో కలిసి కటకటాలపాలయ్యాడు.

దొంగ నోట్లను చలామణి చేస్తున్న కుటుంబం అరెస్టు

By

Published : Nov 23, 2019, 12:01 AM IST

దొంగ నోట్లను చలామణి చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 69వేల 900 విలువ గల నకిలీ నోట్లు, 29 వేల 870 నగదు, 2 కలర్ ప్రింటర్లు, జైలో వాహనం,4 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దాదాపు 3 నెలల నుంచి ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్గొండ జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు మహబూబాబాద్​ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటకు చెందిన సామల శ్రీనివాస్ గతంలో ఆర్​ఎంపీగా పనిచేశాడు. ఇతనికి భార్య భాగ్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు సాయి చరణ్,అఖిల్​లు ఉన్నారు. కుటుంబం గడవక పోవడం వల్ల తొర్రూరులో ఓ హోటల్ ను ప్రారంభించాడు. నష్టం రావడం వల్ల హైదరాబాద్​కు మకాం మార్చి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని పెద్ద కుమారుడు సాయి చరణ్ డిగ్రీ చదువుతూ సినీఫీల్డ్​లో చేరి లఘు చిత్రాలు, ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్​లు తయారు చేస్తున్నాడు.
ఒకవైపు ఆర్థికంగా దివాలా తీయడం, మరో వైపు డబ్బు అవసరం కావడంతో శ్రీనివాస్​ సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని యూట్యూబ్​లో దొంగ నోట్ల తయారీని చూసి, కలర్ ప్రింటర్​ను కొనుగోలు చేశాడు. దీంతో దొంగ నోట్లను తయారు చేసి సొంత వాహనంలో తిరుగుతూ చిన్న చిన్న కిరాణా దుకాణాలు,బెల్ట్ షాప్​లలో నకిలీ నోట్లను చలామణి చేస్తూ చివరకు కుటుంబ సభ్యులంతా కటకటాలపాలయ్యారు. ఈ ముఠాను పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

దొంగ నోట్లను చలామణి చేస్తున్న కుటుంబం అరెస్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details