తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత్రికేయులకు అండగా నిలిచిన వైద్యుడు - జర్నలిస్టులకు నిత్యావసర సరకులు పంపిణీ

కరోనా సమయంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ వైరస్​ కట్టడిలో తమ వంతు పాత్ర పోషిస్తోన్న పాత్రికేయులకు ఓ వైద్యుడు అండగా నిలిచారు. తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ సాయి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు స్వరూప్​ కుమార్​ 60 మంది జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు.

A doctor who distributed rice and essentials to journalists
పాత్రికేయులకు అండగా నిలిచిన వైద్యుడు

By

Published : Apr 12, 2020, 3:16 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ సాయి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో... జర్నలిస్టులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఆస్పత్రి వైద్యుడు స్వరూప్ కుమార్ 60 మంది పాత్రికేయులకు ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పనలో తమ వంతు పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల సేవలు ఎనలేనివని వైద్యుడు స్వరూప్​ కుమార్​ కొనియాడారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన వైద్యుడికి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి :చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది

ABOUT THE AUTHOR

...view details