తెలంగాణ

telangana

ETV Bharat / state

Cow died in car accident: కొట్టంలోకి దూసుకెళ్లిన కారు.. మూగజీవి మృత్యువాత - దేశ్యాతండాలో కారు ప్రమాదం

Cow died in car accident: నిద్రమత్తు, అతివేగం ఓ మూగజీవి ప్రాణాలను తీసింది. అదుపుతప్పిన కారు అనూహ్యంగా ఓ ఇంటి ముందున్న పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆవు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ శివారు దేశ్యాతండాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Cow died in car accident
కొట్టంలోకి దూసుకెళ్లిన కారు

By

Published : Apr 18, 2022, 5:14 PM IST

Cow died in car accident: కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మూగజీవి మృత్యువాత పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా.. ఓ ద్విచక్రవాహనం ధ్వంసమైంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ శివారు దేశ్యాతండాలో జరిగింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో తండావాసులు ఊపిరి పీల్చుకున్నారు. కారు అతివేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తండావాసులు తెలిపారు.

కొట్టంలోకి దూసుకెళ్లిన కారు

మరిపెడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు రహదారి పక్కనే ఉన్న బానోత్‌ లక్ష్మణ్‌ అనే వ్యక్తికి చెందిన పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. అతివేగంతో ఆవును బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం సైతం పూర్తిగా ధ్వంసమైంది. కారు యజమాని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలు సేకరించారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details