మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాముల తండాలో విషాదం జరిగింది. వ్యవసాయ బావిలో ఈతకు దిగిన ఓ బాలుడు నీట మునిగి మృతి చెందాడు. భూక్యా అనిల్ దామెరవంచ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇవాళ సాయంత్రం వ్యవసాయ బావిలో ఈతకొట్టేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడం వల్ల బాలుడి కోసం గాలించగా వ్యవసాయ బావిలో విగత జీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి... బాలుడు మృతి - మహబూబాబాద్‌లో వ్యవసాయభావిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి
ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో మునిగి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాముల తండాలో చోటుచేసుకుంది.
వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి... బాలుడు మృతి
TAGGED:
వ్యవసాయ భావిలో బాలుడు మృతి