మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లు శివారులో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అక్షర ఘటనలో పాల్గొన్నది 9 మంది కాగా... ఆరుగురు మైనర్లు, ముగ్గురు మేజర్లుగా పోలీసులు గుర్తించారు. మరొక యువకుడు పరారీలో ఉన్నాడని... పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
అక్షర కేసులో 8 మంది నిందితుల అరెస్టు... ఒకరు పరారీ - అక్షర ఘటన వార్తలు
దిశ, సమతలాంటి దుర్ఘటనలు మరవక ముందే... మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లు వద్ద యువతిపై సామూహిక అత్యాచారం జరగటం కలచివేసే అంశం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... అక్షర ఘటనలో 8 మంది నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరితగతిన నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

8 ACCUSED ARRESTED IN MAHABOOBABAD GANG RAPE
దిశ, సమత కేసుల తరహాలోనే...
దిశ, సమత కేసుల తరహాలోనే నిందితులకు త్వరితగతిన శిక్ష పడేందుకు అన్ని రకాలుగా కృషిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. వీలైనంత త్వరగా సాక్షాలు సేకరించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సమర్పిస్తామని స్పష్టం చేశారు. మహిళల భద్రతపై ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా... ఈ ఘటన జరగటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా... భద్రత మరింత పటిష్ఠం చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి వివరించారు.
అక్షర కేసులో 8 మంది నిందితుల అరెస్టు... ఒకరు పరారీ
ఇదీ చూడండి:వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం
Last Updated : Feb 10, 2020, 5:41 PM IST