మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 40 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న సింగారపు సురేష్, భూంబత్తుల రాకేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
60క్వింటాళ్ల నల్లబెల్లం, పటిక స్వాధీనం - 60 Quintals Nalla bellam Seized
మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రూ.4.80లక్షల విలువైన 60 క్వింటాళ్ల నల్లబెల్లం, 80 కిలోల పటిక, ఒక డీసీఎం వాహనం, ఆటో, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
60క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం
మరో ఘటనలో నెక్కొండ, కేసముద్రం మండలాలకు చెందిన కొండా శ్రీను, బదావత్ శోభన్, వీరు, భద్రు, వేణు ఆటోలో 20 క్వింటాళ్ల నల్లబెల్లం, 30 కిలోల పటికను తరలిస్తుండగా కేసముద్రం మండలం ధన్నసరి శివారులో పోలీసులు పట్టుకున్నారు. శోభన్ పరారీలో ఉండగా మిగత వారిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ నరేష్‌కుమార్, సీఐ వెంకటరత్నం, కేసముద్రం ఎస్సై సతీష్ ఉన్నారు