మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో ప్రమాదవశాత్తుగా 4 గడ్డి వాములు దగ్ధమై సుమారు 2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మరోచోట నెల్లికుదురు మండలం లక్ష్మీపురం గ్రామ శివారు కొత్త తండాలో విద్యుత్ షార్ట్ సర్కుట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 గుడిసెలు, 4 గడ్డివాములు, 1 ఎడ్లబండి దగ్ధమై 4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. తండాకు చెందిన లూనవత్ సీతారాములు, లూనవత్ సురేశ్లకు చెందిన ఇళ్ళలోని వస్తువులు అన్ని కాలిపోయాయి. బాధితుల రోదన స్థానికులను కలిచివేసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
గడ్డివాములు దగ్ధం... రూ. 6లక్షలు నష్టం - 6 Grass Fire in mahabubabad
లక్షల రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేసిన పశువుల మేత అగ్నికి ఆహుతి అయింది. మహబూబాబాద్ జిల్లాలో వేరు వేరు గ్రామాల్లో సుమారు 6 లక్షల రూపాయల విలువైన 8 గడ్డివాములకు నిప్పంటుకుంది. తమ పశువులకు మేత ఎలా సమకూర్చుకోవాలో అంటూ బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గడ్డివాములు దగ్ధం... రూ. 6లక్షలు నష్టం
ఇవీ చూడండి: అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్
TAGGED:
6 Grass Fire in mahabubabad