తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో 50 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం - 50 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం

అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల నల్లబెల్లం, క్వింటాల్‌ పటికను చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి శివారులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

50 quintals of black Jaggery seized in Mahabubabad
మహబూబాబాద్​లో 50 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం

By

Published : Mar 18, 2020, 10:16 AM IST

మహబూబాబాద్​ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి శివారులో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్‌ చేస్తున్న ఎస్సై ప్రసాదరావు, ఏఎస్సై చందర్‌, కానిస్టేబుల్‌ నరేష్‌లను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా... పట్టుకొని అరెస్టు చేశారు.

వారి నుంచి డీసీఎం వ్యాన్‌, 3 లక్షల విలువైన నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. అనంతరం ఎస్సై ప్రసాదరావు, ఏఎస్సై చందర్‌, కానిస్టేబుల్‌ నరేష్‌లకు ఎస్పీ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

మహబూబాబాద్​లో 50 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం

ఇవీచూడండి:రాష్ట్రంలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details