మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామ పంచాయతీ పరిధిలోని భజన తండాలో కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. 4 రోజుల క్రితం తండాలో పలువురు అనారోగ్యం పాలయ్యారు. మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది తండాలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్సను అందించారు. బాగా నీరసంగా ఉన్న ఆరుగురిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
కలుషిత నీరు తాగి 20మందికి అస్వస్థత - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ జిల్లాలోని భజన తండాలో కలుషిత నీరు తాగి 20మంది అస్వస్థతకు గురయ్యారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తున్నామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు. మంచి నీటి బావి... మిషన్ భగీరథ పైప్‌లైన్ నీరు రెండు కలవడం వల్లే నీరు కలుషితమైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కలుషిత నీరు తాగి 20మందికి అస్వస్థత
మంచి నీటి బావి... మిషన్ భగీరథ పైప్‌లైన్ నీరు రెండు కలవడం వల్లే నీరు కలుషితం అయి అస్వస్థతకు గురైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రెండో దశ అని తండా వాసులు భయపడుతున్నారని... వారికి పరీక్షలు చేశామని వైద్యుడు అవినాశ్ తెలిపారు. వారు తాగిన నీటిని వరంగల్ ల్యాబ్‌కు పంపించామని వెల్లడించారు.
ఇదీ చదవండి:రజినీకాంత్‌కు అస్వస్థత.. జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్