మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 20 ఫీట్ల గొబ్బెమ్మను స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఆవిష్కరించారు. డాక్టర్ గుమ్మడవెళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గొబ్బెమ్మను స్థానిక డీఎస్పీ వెంకటరమణ ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో గోవు పేడతో గొబ్బెమ్మ ఏర్పాటు చేసి పవిత్రంగా భావించి పూజలు చేస్తారని తెలిపారు.
తొర్రూరులో 20 ఫీట్ల గొబ్బెమ్మ.. ఆవిష్కరించిన డీఎస్పీ - 20 feet tall gobbemma in thorrur
గోవుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 20 ఫీట్ల గొబ్బెమ్మను తయారు చేశారు. ఈ గొబ్బెమ్మను డీఎస్పీ వెంకటరమణ ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు.
![తొర్రూరులో 20 ఫీట్ల గొబ్బెమ్మ.. ఆవిష్కరించిన డీఎస్పీ 20 feet tall gobbemma at thorrur in mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10258540-1001-10258540-1610762693413.jpg)
తొర్రూరులో 20 ఫీట్ల గొబ్బెమ్మ
తొర్రూరులో 20 ఫీట్ల గొబ్బెమ్మ
శ్రీ కృష్ణ పరమాత్మ ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తామని తెలిపారు. గోవుల పరిరక్షణకు విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ కోసం ఈ గొబ్బెమ్మను తయారు చేయడం జరిగిందని తెలిపారు.
- ఇదీ చూడండి :96 ఏళ్ల బామ్మ.. అదిరే ముగ్గేసెనమ్మ!