మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉమెన్ ఏంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అమెరికా ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
15 రోజుల సరుకులు ఉచితంగా పంపిణీ - 15 రోజుల సరుకులు పంపిణీ
తొర్రూరులో ఎన్నారై రాజేందర్ జాన్సీరెడ్డి, WETA(ఉమెన్ ఏంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అమెరికా) ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా ప్రతినిధి తిరుపతి రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
15 రోజుల సరుకులు ఉచితంగా పంపిణీ
మండలంలోని 300 మందికి రూ. 3,50,000 వ్యయంతో 15 రోజులకు సరిపడా నిత్యావసరాలను ఇండియా ప్రతినిధి తిరుపతి రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి పేదలకు అందించారు. మాస్కులు ధరించి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి :'అడుగు బయట పెట్టకు.. ఆపదలో పడకు'