తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం - 4 accused arrested

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముల్కలపల్లిలో బియ్యాన్ని నిల్వచేసిన స్థావరంపై దాడులు చేసిన పోలీసులు రెండున్నల లక్షల విలువైన 110 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

110  Quintals rice caught in by police in mulkalapally
అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

By

Published : Jul 1, 2020, 4:41 PM IST

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్‌ మండలం ముల్కలపల్లి నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రెండున్నల లక్షల విలువైన 110 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముల్కలపల్లి, మన్నెగూడెం, తొడేళ్లగూడెం గ్రామాల్లో రేషన్‌ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని బొలేరో, 3 ఆటోల్లో నింపుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.

డోర్నకల్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు అక్రమంగా రవాణా చేసేందుకు వినియోగించిన బొలేరో, మూడు ఆటోలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే బాధ్యులపై కేసులతో పాటు కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details