తెలంగాణ

telangana

ETV Bharat / state

telangana movement: ఆ ఘటనకు నేటితో 11 ఏళ్లు - Mahabubabad district manukota

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయం(telangana movement)లో 2010 మే 28న జరిగిన మానుకోట ఘటన(manukota incident)కు నేటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ తరుణంలో మహబూబాబాద్​లోని రైల్వే స్టేషన్​లో జేఏసీ నాయకులు కంకర రాళ్లను చేత పట్టుకుని ఆనాటి అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

11 years for manukota incident
telangana movement: ఆ ఘటనకు నేటితో 11 ఏళ్లు

By

Published : May 28, 2021, 6:35 PM IST

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయం(telangana movement)లో మహబూబాబాద్ రైల్వే స్టేషన్​లో జరిగిన ఘటనకు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహబూబాబాద్​లోని రైల్వే స్టేషన్​లో జేఏసీ నాయకులు కంకర రాళ్లను చేత పట్టుకుని...ఆ నాటి ఘటనను స్మరించుకుని నినాదాలు చేశారు. అమరవీరుల స్థూపం ముందు అమరులకు నివాళులు అర్పించారు.

మానుకోట ఘటన(manukota incident) తెలంగాణ ఉద్యమ సమయంలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ అన్నారు. వై.ఎస్.జగన్ పార్లమెంట్​లో సీమాంధ్రకు అనుకూలంగా అప్పుడు ఫ్లకార్డ్స్ ప్రదర్శించారని… అందుకే వై.ఎస్ జగన్ ఓదార్పు యాత్రను తెలంగాణ వాదులు వ్యతిరేకించారని పేర్కొన్నారు.

తెలంగాణ వాదుల హెచ్చరికను పెడచెవిన పెట్టి 2010 మే 28న ఓదార్పు యాత్రకు బయల్దేరిన వై.ఎస్.జగన్​కు… మహబూబాబాద్ రైల్వే స్టేషన్​లో ఒకవైపు స్వాగతం చెప్పేందుకు అనుకూల వర్గం... మరో వైపు గో బ్యాక్ జగన్ అంటూ తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున చేరుకున్నారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని… ఆ క్రమంలోనే పోలీసు కాల్పులు, రాళ్ల దాడి చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఆ దాడిలో 11 మంది తెలంగాణ ఉద్యమకారులకు తీవ్రంగా గాయాలయ్యాయని వెల్లడించారు. నేటికి కూడా ప్రభుత్వం వారిని ఆదుకోలేదని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి:Anandaiah: 'కళ్లలో పసరుపోస్తే కరోనా తగ్గుతుందా.. అది అసాధ్యం'

ABOUT THE AUTHOR

...view details