మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగానే కాకుండా అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ నిరక్ష్యరాస్యులు ఉండరు. మద్యం సేవించేవారు ఉండరు.
పోలీస్‌స్టేషన్‌కు వెళ్లని పల్లె
గ్రామస్థులు ఎప్పుడు ఠాణా మెట్టెక్కిన దాఖాలు లేవు. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సర్పంచి, పటేల్, దొర గ్రామంలోని పెద్దలు, యువత, మహిళలతో చర్చించి గ్రామంలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు. గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులున్నా ఎక్కడా ఏ పార్టీకి సంబంధించిన జెండాలు, స్తూపాలు విగ్రహాలు కాని కనిపించవు.
ఆర్థికంగా చితికిపోతున్నామనే..
పదేళ్ల కిందట ఓ కిరాణ దుకాణంలో మద్యం అమ్మేవారు. దానికి అలవాటు పడి పనులు చేయకుండా ఇంటిపట్టునే ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం, కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ నష్టాన్ని గ్రహించిన పల్లెవాసులు గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఎవరూ గుడుంబా తయారు చేయవద్దని.. కాదన్నవారికి జరిమానాలు విధించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇంత నిక్కచ్చిగా ఉండబట్టే పదేళ్లుగా ఇక్కడ గుడుంబా తయారీ, మద్యం అమ్మకాలు, గొలుసుకట్టు దుకాణాలు పూర్తిగా బంద్ అయ్యాయి. మొదట్లో కొంతమంది మద్యం అమ్మకాలు చేపట్టినా వారికి విధించిన జరిమానాలతో గ్రామాభివృద్ధికి ఖర్చు చేశారు. ఇంత ఆదర్శంగా ఉంటున్న తమ గ్రామానికి వట్టెవాగుకు వరదలొస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయని.. అధికారులు వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
మొదట్లో ఒకే వంశం..