కుమురంభీం జైనూరు మండలంలో కిషన్ నాయక్ తాండా వాసులు వ్యవసాయ పనులకు వెళ్లారు. వర్షం కురుస్తుండడంతో చింతకర్ర వాగు దాటేందుకు ఇబ్బంది అవుతుందని వారు తిరుగు ప్రయాణమయ్యారు. భారీ వర్షానికి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో... 30 మంది వ్యవసాయ కూలీలు, గ్రామస్థులు వాగు మధ్యలో చిక్కుకున్నారు.
Rescue: వాగులో చిక్కుకున్న కూలీలు... కాపాడిన యువకులు - వాగులో చిక్కుకున్న వ్యవసాయ కూలీలు
జైనూరు మండలంలో వర్షాలకు చింతకర్ర వాగు ఉప్పొంగింది. వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు వాగు దాటేందుకు ప్రయత్నించడంతో.. ప్రమాదంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు కూలీలను కాపాడారు.
సమాచారం అందుకున్న గ్రామస్థులు వాగు దగ్గరకు చేరుకున్నారు. తాళ్ల సహాయంతో యువకులు అందరిని రక్షించారు. ప్రాణనష్టం జరగకుండా కాపాడిన యువకులను తాండావాసులు అభినందించారు. కుమురంభీం జిల్లాలో ఇలాంటి ఎన్నో వాగులు ఉన్నాయని... వర్షాలు వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తాండా వాసులు వాపోయారు. చింతకర్ర వాగుపై వంతెన నిర్మించాలని ఎన్నోసార్లు విన్నవించామని... ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ పట్టించుకోలేదని వాపోయారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:కార్లలో తప్పనిసరిగా ఇవి ఉండాల్సిందే..