కుమురం భీం జిల్లా కౌటాల మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ పతాకాన్ని ఆవిష్కరించి.. ఆరాధ్యదైవం కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
'ఆదివాసీ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి' - కుమురంభీం జిల్లా కౌటిలాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని.. జీవో నెం3ను రద్దు చేయాలని పలువురు ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
'ఆదివాసీ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి'
ప్రభుత్వం ఆదివాసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. జీవో నంబర్ 3ను రద్దు చేయాలని డిమాండ్ వారు చేశారు. పోడు రైతులకు పట్టాలని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీ సమస్యలపై ఆదివాసులందరు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని సూచించారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్
TAGGED:
కుమురం భీం జిల్లా తాజా వార్త