కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీలు... ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాయిసెంటర్లో వారి సంప్రదాయాల ప్రకారం జెండాలు ఎగురవేసి... దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాయిసెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆదివాసి భవన్లోని కుమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'జల్ జంగల్ జమీన్ నినాదానికి మేము నోచుకోలేదు' - జల్ జంగల్ జమీన్ నినాదానికి మేము నోచుకోలేదు
ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా ఆదివాసీలకే అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
!['జల్ జంగల్ జమీన్ నినాదానికి మేము నోచుకోలేదు' world-tribal-day-celebrations-in-asifabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8357450-376-8357450-1596993039081.jpg)
జల్ జంగల్ జమీన్ నినాదానికి మేము నోచుకోలేదు
జల్ జంగల్ జమీన్ అనే నినాదానికి ఎక్కడ నోచుకోలేదని పలువురు నాయకులు వాపోయారు. ఆదివాసీల నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా ఆదివాసీలకే అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.