కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పేపర్ మిల్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. పేపర్‌మిల్లు పునఃప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. మరోవైపు స్థానిక కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా.. స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆరోపించారు.
సిర్పూర్ పేపర్‌మిల్ ఎదుట కార్మికుల ధర్నా - కుమరం భీం జిల్లా తాజా వార్తలు
కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్‌మిల్ ఎదుట కార్మకులు ధర్నా చేపట్టారు. యాజమాన్య వైఖరికి నిరసనగా మిల్లు గేటు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
సిర్పూర్ పేపర్‌మిల్ ఎదుట కార్మికుల ధర్నా
కార్మికుల నిరసనకు స్థానిక నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యేవరకు కార్మికులకు పూర్తి మద్దతు తెలుపుతామని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, కాంగ్రెస్ నాయకులు డా.హరీశ్ బాబు, భాజపా నాయకులు డా. శ్రీనివాస్, సీఐటీయూ నాయకులు ఓదెలు పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినదించారు.
ఇదీ చూడండి:వర్షాలతో తడిసిముద్దైన ఆ రెండు జిల్లాలు