తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం మౌన పోరాటం - కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​లో ఓ యువతి మౌన పోరాటం

తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఓ యువతి మౌన పోరాటం చేస్తోంది. యువకుడి ఇంటిముందు బైఠాయించి.. న్యాయం జరిగేంతవరకూ పోరాటం చేస్తానని భీష్మించుకుకూర్చుంది.

ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం మౌన పోరాటం
ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం మౌన పోరాటం

By

Published : Feb 8, 2020, 7:40 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​లో ఓ యువతి మౌన పోరాటం చేస్తోంది. పట్టణానికి చెందిన ఈ యువతి నౌగం బస్తీకి చెందిన జూపాక రఘు అనే యువకుడి ఇంటి ముందు బైటాయించింది. రఘు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించింది.

తనను పెళ్లి చేసుకోవడం రఘుకు ఇష్టం ఉన్నా.. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడని ఆమె తెలిపింది. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తానని యువతి స్పష్టం చేసింది.

ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం మౌన పోరాటం

ఇవీ చూడండి:ఘోర అగ్నిప్రమాదం... నాలుగు దుకాణాలు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details