కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన పేద మహిళ కొద్దిరోజులుగా కొవిడ్ సోకి బాధపడుతుంది. పరిస్థితి విషమించడంతో నిన్న ఉదయం మృతి చెందింది. కరోనా వల్ల చనిపోవడంతో.. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ రాలేదు. కనీసం కుటుంబ సభ్యులు సైతం మృతదేహాన్ని ముట్టుకునేందుకు సాహసించలేదు. దిక్కుతోచని స్థితిలో గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు.
కరోనాతో మృతి.. అంత్యక్రియలు జరిపిన గ్రామ సిబ్బంది - funeral by gram panchayat staff
కరోనాతో ఓ మహిళ చనిపోయింది. అయితే కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాలేదు. దీనితో సర్పంచ్ చొరవతో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది.
funerals
పంచాయతీ సర్పంచ్ మెస్రం ఉమ చొరవ తీసుకుని పంచాయతీ సిబ్బందితో దహన సంస్కారాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి పీపీఈ కిట్లు ధరించి... అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు