కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం ఆరెగూడలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన సంతోష్ అనుమానంతో భార్యను గొడ్డలితో చంపేశాడని గ్రామీణ సీఐ నరేందర్ తెలిపారు. అయితే నిందితుడికి, మృతురాలికి తరచూ గొడవలు జరిగేవని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఘర్షణ పెద్దదవడం వల్ల హత్య చేశాడని స్పష్టం చేశారు.
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త - కుమురం భీం జిల్లా
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్ వెల్లడించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే..
Last Updated : Mar 19, 2020, 1:39 PM IST