తెలంగాణ

telangana

ETV Bharat / state

విధులకు ఆటంకం కల్గిస్తే ఉపేక్షించం: ఐజీ నాగిరెడ్డి - Warnagal Range Ig-Nagireddy-pressmeet-in-kagaznagar Incedent

కుమురం భీం జిల్లాలో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడి సంచలనం సృష్టిస్తోంది. దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ రేంజి ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన కోనేరు కృష్ణారావు రాజీనామా చేశారు.

విధులకు ఆటంకం కల్గిస్తే ఉపేక్షించం: ఐజీ నాగిరెడ్డి

By

Published : Jun 30, 2019, 9:22 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారిణి అనితపై జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు నేతృత్వంలో కొంతమంది కర్రలతో దాడి చేయటం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై వరంగల్ రేంజి ఐజీ నాగిరెడ్డి స్పందించారు. అటవీ శాఖ అధికారుల విధులకు ఎవరు ఆటంకం కలిగించిన ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కోనేరు కృష్ణారావు, బురం పొశంను అదుపులోకి తీసుకున్నామని.. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు, కుమురం భీం ఎస్పీ మల్లారెడ్డి పాల్గొన్నారు.

విధులకు ఆటంకం కల్గిస్తే ఉపేక్షించం: ఐజీ నాగిరెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details