కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని పాలరాపు గుట్టపై రాబందులు ఉన్నాయని 2013లో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వీటి పర్యవేక్షణకు ఓ వ్యక్తితో పాటు, మరో ముగ్గురు ఉద్యోగులను నియమించారు. నిత్యం పశువుల మృత కళేబరాలు ఆహారంగా వేసేవారు.
మహారాష్ట్రకు తరలివెళ్లిన పాలరాపుగుట్ట రాబందులు - vultures went to Maharashtra from Asifabad
కొన్ని నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో పాలరాపు గుట్ట కూలిపోయింది. గుట్టపై ఉన్న రాబందులు మహారాష్ట్రకు తరలి వెళ్లాయి.

రెండు నెలలుగా ఈ ప్రాంతంలో పులుల కదలిక ఎక్కువవ్వడం వల్ల అటవీ అధికారులు.. వాటిని బంధించే పనిలో నిమగ్నమయ్యారు. పులి దాడిలో ఇద్దరు మృతి చెందడం వల్ల పక్షి పర్యవేక్షకునితో పాటు నియమించిన మరో ఇద్దరిని తీసివేశారు. వర్షాలకు పాలరాపు గుట్ట కూలిపోవడం వల్ల రాబందులు మహారాష్ట్రకు తరలివెళ్లాయి.
బెజ్జూర్ మండలం పాలరాపు గుట్టకు 40 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలో సిరోంచ అటవీ డివిజన్లో 8 రాబందు సంరక్షణ కేంద్రాలున్నాయి. బెజ్జూర్ రాబందులు ఈ కేంద్రాలకు తరలి వెళ్లినట్లు అక్కడి అటవీ అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో 252 రాబందులను అధికారులు ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. వీటికి ఆహారం అందించడానికి అడవిలోనే మృత పశువులను ఉంచడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి :శీతాకాలం అతిథులతో సూరత్‌కు కొత్తశోభ