ప్రాణహిత నదికి ఎడమవైపు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా.. కుడివైపు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఉన్నాయి. గడ్చిరౌలి జిల్లాలోని కమలాపూర్, సిరొంచ రేంజ్‌లలో ‘ఒక్కోచోట ఎకరా విస్తీర్ణంలో రాబందులకు రెస్టారెంట్‌లు కట్టారు. చనిపోయిన పశువుల్ని ఒక్కోటి రూ.వెయ్యి చొప్పున కొనుగోలుచేసి వాటికి ఆహారంగా ఇస్తున్నారు. దీంతో గతంలో పాలరాపుగుట్టపై ఉండే రాబందులు.. మహారాష్ట్రకు వలసపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ 300 వరకు రాబందులున్నాయి. పెంచికల్‌పేట మండలం నందిగాంలో అటవీశాఖ ‘రాబందు కెఫ్‌టేరియా’ ఏర్పాటుచేసినా బడ్జెట్ లేక వాటికి సరిగా ఆహారం అందించలేకపోతున్నారు. ‘కొన్నేళ్లుగా ముసలి పశువులను వధశాలలకు విక్రయిస్తుండడంతో రాబందులకు ఆహారం దొరకట్లేదని అటవీ అధికారి ఒకరు వివరించారు.
మహారాష్ట్రకు రాబందులు వలస.. మన దగ్గర మిగిలినవి 10-12 మాత్రమే! - Vultures news
తెలుగు రాష్ట్రాల్లో రాబందులు కనుమరుగవుతుండడం పర్యావరణ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా తెలంగాణాలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం పాలరాపుగుట్టలో ఒకట్రెండేళ్ల క్రితం 35-37 రాబందులు ఉండగా.. ఇప్పడు 10-12 మాత్రమే మిగిలాయి.
మహారాష్ట్రకు రాబందులు వలస.. మన దగ్గర మిగిలినవి 10-12 మాత్రమే!