కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల పేరిట ప్రజలు ప్రతినిత్యం మార్కెట్కు వస్తున్నారు. కనీస రక్షణ చర్యలు లేకుండా, సామాజిక దూరం పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి అధికమవుతోంది. దీనితో ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు.
ఆ పట్టణంలో 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ - Kagaznagar news
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వ్యాపారస్తులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. 15 రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు.
Voluntary lockdown for 15 days in Kagaznagar
ఈ నేపథ్యంలో కాగజ్నగర్ మర్చంట్ అసోసియేషన్, వస్త్ర వ్యాపారుల సంఘం సంయుక్తంగా 15 రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాటిస్తున్న లాక్డౌన్కు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి:నగరంలో దుకాణదారుల స్వచ్ఛంద లాక్డౌన్