కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జురు మండలకేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నట్లు గ్రామ పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. ఈనెల 14 నుంచి 23 వరకు లాక్డౌన్ అమలుచేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.
బెజ్జూరులో స్వచ్ఛంద లాక్డౌన్
కరోనా మహమ్మరిని నియంత్రించేందుకు గ్రామాలు నడుం బిగించాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం వల్ల స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకుంటున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో స్వచ్ఛంద లాక్డౌన్ అమలుచేయాలని గ్రామపంచాయతీ నిర్ణయించింది.
బెజ్జూరులో స్వచ్ఛంద లాక్డౌన్, గ్రామాల్లో లాక్డౌన్
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన దక్కింది. ఈ సమావేశంలో బెజ్జురు సర్పంచ్ అన్సార్ హుస్సేన్, ఎస్సై సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనా కట్టడి, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష