భిన్నమైన భౌగోళిక పరిస్థితులతో కూడుకుని ఉన్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు వరుణుడు ప్రత్యక్ష నరకం చూపించడం షరామామూలు విషయం. చినుకు పడిందంటే పొంగిపొర్లే వాగులు వంకలతో ప్రజల కష్టాలు అన్నీఇన్ని కావు. వాంకిడి మండలం ఖమన గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకధాటిగా వర్షాలు కురవడం వల్ల ఖమన వాగు ఉప్పొంగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పంట పొలాలకు వెళ్లడానికి రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వానొచ్చెనంటే వణుకొస్తదీ.. ఆ వాగుతో భయమేస్తదీ..! - kumurambheem asifabad district news
వర్షమొస్తే చాలు.. ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఖమన గ్రామం పరిస్థితి ఇది. ఖమన వాగుపై వంతెన లేకపోవడం వల్ల గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వానొస్తే చాలు... ఆ గ్రామస్థులకు వణుకొస్తదీ..!
ఇదంతా వాగుపై వంతెన లేకపోవడం వల్లనే జరుగుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఖమన వాగు ఉప్పొంగి ప్రవహించిన సమయంలో గ్రామస్థులకు చిక్కులు తప్పడం లేదు. నాయకులు, అధికారులు మారినా ఆ గ్రామ పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఖమన వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: భూమాయపై కొత్తపోచంపాడ్ గ్రామస్థుల ఆందోళన