కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావును కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్‌కంటే ముందు నుంచి కాగజ్‌నగర్‌లో చిక్కుకున్న వలస కూలీలను సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ పాల్వాయి హరీశ్‌బాబు నేతృత్వంలో స్వస్థలాలకు పంపించారు.
'వలస కూలీలకు నువ్వు అన్నం పెట్టినవా' - CM KCR ignores migrants' vh comments on cm kcr
కేంద్రం స్పందించేదాక వలసకూలీలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడైనా వలస కూలీలకు అన్నం పెట్టావా అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
!['వలస కూలీలకు నువ్వు అన్నం పెట్టినవా' vh hanumantha rao comments on kcr do you feed the migrant workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7196436-251-7196436-1589455635910.jpg)
'వలస కూలీలకు నువ్వు అన్నం పెట్టినవా'
వలస కూలీలకు, పత్తి రైతులకు సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ నుంచి వీహెచ్ కారులో బయలుదేరారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా రెబ్బెన పోలీసులు మార్గమధ్యలోనే వీహెచ్‌ని అరెస్టు చేసి రెబ్బెన స్టేషన్‌కు తరలించారు. నేనేమైనా నక్సలైట్‌నా.. మాజీ ఎంపీ అని కూడా చూడకుండా అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు.
ఇదీ చూడండి :అప్పుడు టీఎస్ ఐపాస్... ఇప్పుడు టీఎస్ బీపాస్
Last Updated : May 14, 2020, 6:46 PM IST