కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకానికి ఆర్టీసీ అధికారుల ప్రకటనలు చూసి వేకువజామునే నిరుద్యోగులు డిపో ముందు బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిరీక్షించినా.. తమను విధుల్లోకి తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నారని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగాలకై నిరుద్యోగుల పడిగాపులు - unemployees
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు గత పది రోజుల నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్లను నియమిస్తున్నారు అధికారులు. ఆసిఫాబాద్ డిపోలో ఖాళీలు లేవని వెనుకకు పంపిస్తున్నందున నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగాలకై నిరుద్యోగుల పడిగాపులు