కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం నక్కలగూడ క్రాస్ రోడ్డు సమీపంలో కలకలం రేగింది. అంతర్రాష్ట్ర రహదారి సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.
పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం - kumuram bheem distrcit
కుమురం భీం జిల్లా నక్కలగూడ క్రాస్‌రోడ్డు వద్ద పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం కలకలం రేగింది. ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు.. జాగిలాలలో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం
ఘటన స్థలిని సందర్శించిన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళ శరీరం పాక్షికంగా కాలిపోయి ఉందని.. ఆకుపచ్చ చీర, ఎర్ర జాకెట్ పూర్తిగా కాలిపోయిందని ఏఎస్పీ వైవిఎస్ సధీంద్ర తెలిపారు. జాగిలాలతో ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.