కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో చోరీ జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా శివమల్లన్న స్వామి ఆలయం మూసి ఉంటోంది. ఇదే అదునుగా చేసుకున్న దుండగులు ఆలయం తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు.
ఈస్గాం శివమల్లన్న ఆలయంలో చోరీ - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో చోరీ
లాక్డౌన్ సమయంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు మొత్తం మూడు హుండీలను, ఒక సీసీ కెమెరాను ధ్వంసం చేశారు.

ఈస్గాం శివమల్లన్న ఆలయంలో చోరీ
ఆలయంలోని మూడు హుండీలను, ఒక సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఆలయానికి కాపలాగా ఉండే వాచ్ మెన్ ఉదయం లేచేసరికి గర్భగుడి తలుపులు తెరుచుకుని, ఆలయ హుండీలు పగులగొట్టి ఉన్నాయని ఆలయ ఈ ఓ, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.