TTWRDC Asifabad Students Protest :ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద బూరుగుడా విద్యార్థినులు ధర్నాకు దిగారు. కళాశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ ఆరోపించారు. మొదట హస్టల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి, అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు, ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాల్సిందేనని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Asifabad TTWRDC Students Protest Against Principal: ఆసిఫాబాద్‌లో గురుకుల గిరిజన కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ తీరుతో ఆందోళన బాట పట్టారు. కళాశాల ప్రిన్సిపల్ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినులు నిరసనకు దిగారు. ఆసిఫాబాద్ జిల్లా బూరుగుడా సమీపంలోనిట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ డిగ్రీ కళాశాలలో(Tribal Welfare Residential Degree College For Women) ప్రిన్సిపల్ దివ్యరాణి తమను వేధిస్తున్నారంటూ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్ వద్దకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికారులు పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
"ప్రిన్స్‌పల్ మా సమస్యలు అసలు పట్టించుకోవడం లేదు. మా పట్ల దురుసుగా ప్రవర్తించారు. మమల్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. హాస్టర్ ఆహారం బాగోలేదని మా సమస్యలు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు సంవత్సరం నుంచి ప్రిన్సిపల్ తమను వేధింపులకు గురిచేస్తున్నారు. ఆర్సీవో వచ్చినా తమను కలవడాని ప్రిన్సిపల్ అనుమతిచ్చేవారు కాదు. కళాశాలలో జరిగే కార్యక్రమాలకు మా దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారు. మాకోసం ప్రభుత్వం ద్వారా వచ్చే బడ్జెట్ వివరాలు కూడా తెలియనివ్వడం లేదు. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాల్సిందే " - విద్యార్థినులు
రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థినులు - వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్