రేపటినుంచి తలసేమియా రోగులకు రక్తదానం - TRS party Formation Day celebration
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు ఆర్పించారు.
![రేపటినుంచి తలసేమియా రోగులకు రక్తదానం TRS party Formation Day celebration in Kumuram Bhim Asifabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6958120-30-6958120-1587981019666.jpg)
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకులను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్నికి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు ఆర్పించి... తెలంగాణ తల్లికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తలసేమియా రోగులకు అండగా రేపటి నుంచి వారం రోజుల పాటు రక్తదానం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.