తెలంగాణ

telangana

ETV Bharat / state

ముమ్మారు తలాక్ ఆమోదంపై  సంబురాలు - Tripul thalak amodham, bjp samburaalu

ముమ్మారు తలాక్​ బిల్లు ఆమోదం పొందడంతో మైనార్టీ మహిళలు, భాజపా నేతలు హర్షం వ్యక్తం చేస్తూ కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో సంబురాలు చేసుకున్నారు.

ముమ్మారు తలాక్ ఆమోదంపై  సంబురాలు

By

Published : Aug 1, 2019, 7:41 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో భాజపా నేతలు, మైనార్టీ మహిళలు సంబురాలు చేసుకున్నారు. ముమ్మారు తలాక్​ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, కులమతాలకు అతీతంగా భారతీయ మహిళలందరికీ ప్రాధాన్యం కల్పించే నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని భాజపా మహిళా నాయకురాలు కొత్తపల్లి అనిత తెలిపారు.

ముమ్మారు తలాక్ ఆమోదంపై సంబురాలు

ABOUT THE AUTHOR

...view details