తెలంగాణ

telangana

ETV Bharat / state

వాంకిడిలో జాతీయ రహదారిపై ఆదివాసీల ధర్నా

ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీలు మరోసారి ఆగ్రహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములను కబ్జా చేసిన లంబాడీలను ఆ ప్రాంతం నుంచి పంపేయాలని డిమాండ్​ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా చేశారు.

వాంకిడిలో జాతీయ రహదారిపై ఆదీవాసీల ధర్నా
వాంకిడిలో జాతీయ రహదారిపై ఆదివాసీల ధర్నా

By

Published : Dec 15, 2020, 8:57 PM IST

Updated : Dec 15, 2020, 10:52 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివాసీలు ధర్నా చేశారు. లంజన్ వీర గ్రామ శివారులోని ఏజెన్సీ భూములను మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడీలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వారిని ఖాళీ చేయించాలని డిమాండ్​ చేశారు.

లంజన్ వీర గ్రామం వైపు ఆదివాసీలంతా ర్యాలీగా బయలుదేరగా... మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అంతర్​రాష్ట్ర రహదారిపై సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేపట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలు రాస్తారోకో నిర్వహించారు. ఆదివాసీల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి:'గల్లీలో చిందులు... దిల్లీలో విందులు..!'

Last Updated : Dec 15, 2020, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details