తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈస్గం శివమల్లన్నకు ఆదివాసీల ప్రత్యేక పూజలు - నాగోబా జాతర వార్తలు

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్​ జిల్లాలోని ఈస్గం శివమల్లన్నను ఆదివాసీలు దర్శించుకున్నారు. నాగోబా జాతరకు ముందు.. ఏటా స్వామిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ అని చెప్పారు.

esgam mallanna
ఈస్గం శివమల్లన్నకు ఆదివాసీల ప్రత్యేక పూజలు

By

Published : Feb 8, 2021, 5:29 AM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ మండలంలోని ఈస్గం శివమల్లన్న స్వామిని ఆదివాసీలు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్​తోపాటు మహారాష్ట్రలోని ఆదివాసీలు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఛైర్మన్​ ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ డోలు, వాద్యాల నడుమ ఆదివాసీ పెద్దలు శివమల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనభోజనాలు చేశారు. నాగోబా జాతరకు ముందు ఏటా శివమల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఆదివాసీ పెద్దలు తెలిపారు.

ఇవీచూడండి:కళలు, సంస్కృతులకు పట్టం కడతాం: శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details