కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎన్నో ఉత్తమ సేవలు అందించారని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఆదివాసీల సమస్యలు గుర్తించి, త్వరితగతిన పరిష్కరించి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్గా విధులు నిర్వర్తించిన సందీప్ కుమార్ ఝా బదిలీకి నిరసనగా తిర్యాని కుమురం భీం చౌరస్తాలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తిర్యాణి తహసీల్దార్ మష్కురు అలీకి వినతి పత్రాన్ని సమర్పించారు.
'ఉత్తమ సేవలందించారు... బదిలీ నిలిపివేయండి' - komaram bheem district latest news
కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీని నిలిపివేయాలని కోరుతూ తిర్యాని మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లాలో ఆయన ఉత్తమ సేవలు అందించారని... బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
'ఉత్తమ సేవలందించారు... బదిలీ నిలిపివేయండి'
కొంతమంది నాయకులకు ఆయనంటే గిట్టకనే తొమ్మిది నెలల వ్యవధిలోనే బదిలీ చేయించారని వారు ఆరోపించారు. వెంటనే ఆయన బదిలీని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తుడుందెబ్బ అధ్యక్షులు వేడ్మ భగవంతరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు.