తెలంగాణ

telangana

ETV Bharat / state

చిలాటుగూడలో పులి జాడలు... భయాందోళనలో స్థానికులు

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా చిలాటుగూడ సమీపంలో పులి సంచరిస్తోందంటూ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని... అధికారులు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు అటవీశాఖ అధికారి పూర్ణిమ తెలిపారు.

Traces of tiger in Chilatuguda asifabad district
చిలాటుగూడలో పులి జాడలు... భయంలో స్థానికులు

By

Published : Mar 12, 2020, 4:24 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా ఆసిఫాబాద్​ మండలంలోని చిలాటుగూడ గ్రామ సమీపంలో పులి సంచరిస్తోందంటూ... స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామ శివారులో ఓ వాగు ఒడ్డున పులి అడుగు జాడలు గుర్తించారు.

చిలాటుగూడలో పులి జాడలు... భయంలో స్థానికులు

కవ్వాల్‌ అభయారణ్య ప్రాంతంకాగా అడవి మృగాలు సంచరించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని... భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు అటవీ శాఖ అధికారి పూర్ణిమ అన్నారు.

ఇదీ చదవండిఃకరోనా నుంచి కాపాడుకోండిలా!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details