కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో పులిని పోలిన పిల్లలు లభ్యం కావడం కలకలం రేపింది. మండలంలోని నజృల్ నగర్ పంచాయతీ పరిధిలోని సమీప అటవీ ప్రాంతంలో స్థానికులు సంచరిస్తుండగా వారికి మూడు అటవీ జంతువుల పిల్లలు కనిపించాయి. అవి చూడటానికి పులి పిల్లల్లాగా ఉండటం వల్ల వెంటనే అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. గత కొన్ని రోజులుగా కడంబ, ఈస్గాం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, పిల్లలు లభించిన ప్రాంతంలోనే పులి అడుగులు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు వాటిని పరిశీలించి అవి అడవి పిల్లి(జంగబిల్లి) పిల్లలుగా ధ్రువీకరించారు.
అటవీ ప్రాంతంలో పులిని పోలిన పిల్లలు లభ్యం - అటవీ ప్రాంతంలో పులిని పోలిన పిల్లలు లభ్యం
కాగజ్నగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో పులిని పోలిన పిల్లలు లభ్యం కావటం కలకలం రేపింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించగా.. వారు వాటిని పరిశీలించారు.
Breaking News