తెలంగాణ

telangana

ETV Bharat / state

పులులను కావాలనే వదిలారు.. ఎంపీ కీలక వ్యాఖ్యలు - telangana news

మనుషుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు మండిపడ్డారు. అడవి నుంచి ఆదివాసీలను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

adilabad mp soyam
'ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసేందుకే పులులు వదిలారు'

By

Published : Jan 4, 2021, 7:22 PM IST

పులులను కావాలనే వదిలారు.. ఎంపీ కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి ఆదిలాబాద్​ సహా చుట్టుపక్కల జిల్లాల్లో జనావాసాల్లోకి పులుల రావడంపై ఎంపీ సోయం బాపూరావు ఆందోళన వ్యక్తం చేశారు. పులి దాడిలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. చాలా పశువులు మరణించాయన్నారు. ప్రజలూ పులి సంచారంపై భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.

జనావాసాల్లోకి పులులు రావడం కుట్రగా అభివర్ణించిన సోయం.. అడవి నుంచి ఆదివాసీలను దూరం చేసేందుకు పులులను వదిలారని ఆరోపించారు. మనుషుల కంటే పులుల ప్రాణాలకే ఎక్కువ విలువిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అటవీ అధికారులకు పులులను పట్టుకోవడం పెద్దసమస్య కాదని.. కావాలనే పట్టించుకోవడం లేదని బాపూరావు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని.. ఆదివాసీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

'ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసేందుకే పులులు వదిలారు'

ఇవీచూడండి:ఆగని పెద్దపులి వేట.. బెంబేలెత్తిస్తున్న వరుస దాడులు

ABOUT THE AUTHOR

...view details