కొద్దిరోజులుగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అలజడి సృష్టించి మహారాష్ట్ర వెళ్లిపోయిన పులి మళ్లీ కనిపించడం వల్ల స్థానికులు భయందోళనలకు గురవుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని పలు అటవీప్రాంతాల్లో సంచరిస్తూ కలకలం రేపుతోంది. గత నెలలో బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీప్రాంతంలో పశువును హతమార్చిన పులిని బందించేందుకు ప్రయత్నించగా చిక్కలేదు.
బెజ్జూరు అటవీప్రాంతంలో మళ్లీ పులి సంచారం - telangana varthalu
బెజ్జూరు అటవీప్రాంతంలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. పులి కనిపించడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మళ్లీ ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
బెజ్జూరు అటవీప్రాంతంలో మళ్లీ పులి సంచారం
మళ్లీ ప్రాణహిత నది తీరం నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించింది. పెంచికలపేటలో 3 పశువులను హతమార్చి... బెజ్జూరు అటవీప్రాంతంలోకి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. ఇవాళ బెజ్జూరు మండలం హేటిగూడ సమీపంలో రోడ్డు దాటుతున్న పులిని చూసి... ఓ వ్యక్తి చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. మళ్లీ ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: 15 మంది రిమ్స్ వైద్య విద్యార్థులకు అస్వస్థత