కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత మూడు నెలల నుంచి పులి సంచరిస్తుండడం వల్ల జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. జిల్లాలోని తిర్యాణి, రెబ్బెన, ఆసిఫాబాద్ మండలాలలో పులి సంచరిస్తూ ఆవులను సంహరిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గత మూడు నెలల నుంచి పులిని బంధించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం - కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం అక్కడి ప్రజలకు భయాందోళనలు కలిగిస్తోంది. గత మూడు నెలలుగా దాన్ని బంధించడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నేడు తిర్యాణి మండలంలోని ఖైరిగూడ డీబీఎల్ భూ ఉపరితల గనుల్లో పులి సంచరిస్తుండగా కార్మికులు, డ్రైవర్లు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు
Tiger wandering
అయినప్పటికీ వారికి పులి దొరకకపోవడంతో జిల్లాలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈరోజు తిర్యాణి మండలంలోని ఖైరిగూడ డీబీఎల్ భూ ఉపరితల గనుల్లో పులి సంచరిస్తుండగా కార్మికులు, డ్రైవర్లు చూసి భయపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.