తెలంగాణ

telangana

ETV Bharat / state

తుమ్మిడిహట్టి సందర్శనకు బయల్దేరిన కాంగ్రెస్ నేతలు - తుమ్మిడిహట్టి ప్రాజెక్టు

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనకు కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ నుంచి తెలంగాణ ఎక్స్​ప్రెస్​లో కాగజ్​నగర్​ పయనమయ్యారు.

తుమ్మిడిహట్టి సందర్శనకు బయల్దేరిన కాంగ్రెస్ నేతలు

By

Published : Aug 26, 2019, 8:43 AM IST

Updated : Aug 26, 2019, 12:07 PM IST

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్​కు పయన మయ్యారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్​, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్​ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, మల్లురవితో పాటు పలువురు ముఖ్య నాయకులు ప్రాజెక్టును సందర్శించి... క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోనున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మైలారం వరకు 70 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి అక్కడ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్​ చేస్తే తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీటిని తరలించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడమే కాకుండా... ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరారు.

తుమ్మిడిహట్టి సందర్శనకు బయల్దేరిన కాంగ్రెస్ నేతలు
Last Updated : Aug 26, 2019, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details