ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అటవీ నిర్వాసితుల కోసం అటవీ హక్కుల చట్టం-2006ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. తొమ్మిది తెగల ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అడవిలో తవ్వుతున్న కందకాలు వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి: తుడుందెబ్బ - కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు మహాధర్నా
కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించి, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి: తుడుందెబ్బ
నాన్ ఏజెన్సీ ఆదివాసీ గూడాలను, గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని, టీఆర్టీ ఉద్యోగాలు తొమ్మిది తెగల ఆదివాసీలకే ఇవ్వాలని తుడుందెబ్బ అధ్యక్షుడు కోత్నాక విజయ్ డిమాండ్ చేశారు. వివిధ ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు మహా ధర్నాలో పాల్గొని కలెక్టర్ సందీప్ కుమార్కు వినతి పత్రం అందించారు. ఆదివాసీ సమస్యలు ప్రభుత్వానికి తెలియపరచి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ఇదీ చూడండి:కశ్మీర్ సైనిక వ్యూహం ఈశాన్యంలో ఫలిస్తుందా?