చోరీ కేసులో ముగ్గురు దొంగలు అరెస్ట్ - three-robbers-arrested'
ఓ చోరీ కేసులో ముగ్గురు దొంగలను కొమురం భీం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాలనేరస్థులు కావడం గమనార్హం. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
![చోరీ కేసులో ముగ్గురు దొంగలు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3932089-305-3932089-1563961706322.jpg)
కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు, ఒక కొనుగోలు దారుడు ఉన్నారని పట్టణ ఎస్ఎచ్ఓ కిరణ్ తెలిపారు. పట్టణానికి చెందిన బాలనేరస్థుడు తన స్నేహితుడితో కలిసి నౌగం బస్తీ, సర్సిల్క్ కాలనీ, బాలాజీ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. దొంగిలించిన సొమ్మును మంచిర్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ సాజిద్‌కు అమ్మేవారని వెల్లడించారు. మంచిర్యాలలో సైతం పలు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుల నుంచి 70 వేల నగదు, 5లక్షల 50 వేల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.