తెలంగాణ

telangana

ETV Bharat / state

వాళ్లు ఊరెళ్లారు... వీళ్లు దోచేశారు - Theft at locked home in Asifabad

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో జరిగింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి యజమానులు వచ్చాక ఎంత సొత్తు పోయిందనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Thieves who stole a locked house at asifabad district
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

By

Published : Jan 1, 2020, 2:04 PM IST

Updated : Jan 1, 2020, 3:45 PM IST

కుమరం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరింగింది. తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు అందినకాడికి దోచుకెళ్లారు. గుంటూరు కాలనీకి చెందిన సూరిశెట్టి లింగయ్య శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ముంబై వెళ్ళాడు. ఇవాళ ఉదయం తలుపులు తెరచి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రెండు గదుల్లో బీరువా లాకర్లు తెరిచారని, యజమానులు వచ్చాక ఎంత సొత్తు చోరీ అయింది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
Last Updated : Jan 1, 2020, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details