Podu lands issue: కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల పోరు కొనసాగుతోంది. ఆసిఫాబాద్ మండలం రౌటసంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొందలగడ్డలో అటవీ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. గ్రామంలో 300 ఎకరాలకు ఆర్ఎఫ్ఆర్ కింద రెవెన్యూ శాఖ పట్టాలు ఇచ్చింది. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది.
పోడు భూముల వివాదం.. అటవీ సిబ్బందితో రైతుల వాగ్వాదం
Podu lands issue: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బొందలగడ్డ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల విషయంలో రైతులు అటవీశాఖ సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. ఆర్ఎఫ్ఆర్ భూముల్లో మొక్కలు నాటేందుకు అధికారులు యత్నించగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకునేది లేదని వారు ఎడ్లబండ్లను అడ్డంగా పెట్టారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
పోడు భూములు
ఇందులో భాగంగానే సంబంధిత భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ సిబ్బంది బొందలగడ్డ గ్రామానికి వెళ్లారు. దీంతో ఆందోళనకు దిగిన గ్రామస్థులు అధికారులను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు వదిలేదిలేదని పట్టుబట్టి అక్కడికి వెళ్లకుండా ఎడ్లబండ్లను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Last Updated : Jun 27, 2022, 2:56 PM IST