లాక్ డౌన్ కారణంగా .. ఆకలితో అలమటిస్తున్న గిరిజనులకు నిత్యావసర సరకులను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు అందజేశారు. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న గిరిజనులను.. పలువురు దాతలు మానవతా హృదయముతో ఆదుకోవడం పట్ల అభినందించారు.
సీతక్కకు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే..! - ఎమ్మెల్యే సీతక్కను తెరాస అడ్డుకుంటోంది
ఆదివాసీ గిరిజన మహిళ ఎమ్మెల్యే సీతక్క ప్రజా ఆదరణను తెరాస నేతలు తట్టుకోలేక పోతున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా .. ఆకలితో అలమటిస్తున్న గిరిజనులకు నిత్యావసర సరకులను అందజేశారు.
![సీతక్కకు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే..! "The popularity of MLA Sitaka .. Trs does not tolerate"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7303303-709-7303303-1590139830463.jpg)
"ఎమ్మెల్యే సీతక్క ప్రజాదరణ.. తెరాస సహించడం లేదు"
కరోనా వైరస్ పట్టణాలకే పరిమితం కాదని.. పల్లెల్లో కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని విశ్వప్రసాద్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని గిరిజనులకు సూచించారు. అధికార పార్టీ నేతలు పోలీసుల సహకారంతో.. ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్నారని ఆరోపించారు. ఆదివాసీ గిరిజన మహిళ ఎమ్మెల్యే ప్రజా ఆదరణను తెరాస నేతలు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి:సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు