కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెండోరోజు రెండు జడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. తెదేపా నుంచి పెరుగు ఆత్మారాం, తెరాస నుంచి అలీబిన్ అహ్మద్ బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకు సీపీఐ 2, కాంగ్రెస్ 6, తెరాస నుంచి 5 నామ పత్రాలను దాఖలు చేశారు. మెుత్తంగా 15 నామ పత్రాలు దాఖలు అయ్యాయని ఎంపీడీఓ తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 15 నామపత్రాలు దాఖలు - TOTAL 15 NOMINATIONS
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మెుత్తంగా దాఖలైన 15 నామ పత్రాలు